రైతులపై వివక్ష తగదు

ABN , First Publish Date - 2020-12-25T05:50:44+05:30 IST

దేశ రాజ ధానిలో గత 25 రోజులుగా రైతు లు అలుపెరుగని పోరాటం చేస్తున్నా బీజేపీ ప్రభుత్వం చలించడం లేదని వామపక్ష నాయ కులు, రైతు కార్మిక సంఘాల నాయకులు అన్నారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద గురువారం నిరసన చేపట్టారు.

రైతులపై వివక్ష తగదు
కాశీబుగ్గ: నిరసన తెలుపుతున్న రైతులు

కాశీబుగ్గ: దేశ రాజ ధానిలో గత 25 రోజులుగా రైతు లు అలుపెరుగని పోరాటం చేస్తున్నా బీజేపీ ప్రభుత్వం చలించడం లేదని వామపక్ష నాయ కులు, రైతు కార్మిక సంఘాల నాయకులు అన్నారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద గురువారం నిరసన చేపట్టారు.  రైతుల నిరహార దీక్షకు మద్దతుగా చేపట్టనున్న 4 రోజుల నిరాహార దీక్షను జయప్ర దం చేయాలని కోరారు. ఫ రేగిడి:  లచ్చన్నవలస గ్రామంలో కిసాన్‌జ్యోతి సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి బుడతి అప్పలనాయుడు, రాజాం నియోజకవర్గం రైతు సంఘం ప్రతినిధి మీసాల అప్పలనాయుడు ఈ ర్యాలీలో పాల్గొని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం ప్రతినిధులు మీసాల తవిటి నాయుడు, పారన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2020-12-25T05:50:44+05:30 IST