-
-
Home » Andhra Pradesh » Srikakulam » Devotees flocked to see Aditya
-
ఆదిత్యుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2020-12-07T05:10:03+05:30 IST
అరసవల్లి సూర్యనారాయణస్వామి దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు.

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, డిసెంబరు 6: అరసవల్లి సూర్యనారాయణస్వామి దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. కార్తీక మాసం నాలుగో ఆదివారం కావడంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఉచిత, రూ.100 టిక్కెట్ల క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ప్రసాద విక్రయాల కౌంటర్ల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా డీఎస్పీ శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది చర్యలు చేపట్టారు.