రైతులకు మద్దతుగా కాగడాల ప్రదర్శన

ABN , First Publish Date - 2020-12-17T05:43:14+05:30 IST

ఢిల్లీలో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి మద్దతుగా శ్రీకాకుళం రూరల్‌ మండలం వప్పంగిలో బుధవారం సాయంత్రం జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు.

రైతులకు మద్దతుగా కాగడాల ప్రదర్శన
కాగడాల ప్రదర్శన నిర్వహిస్తున్న రైతు సంఘాల నాయకులు



గుజరాతీపేట: ఢిల్లీలో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి మద్దతుగా శ్రీకాకుళం రూరల్‌ మండలం వప్పంగిలో బుధవారం సాయంత్రం జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కె.మోహనరావు,  పి.ప్రసాదరావు, టి.తిరుపతిరావు, గంగారపు సింహాచలం, తదితరులు పాల్గొ న్నారు. ఫ ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి స్థానిక ఎల్‌ఐసీ బ్రాంచి ఉద్యోగులు బుధవారం సంఘీభావం తెలిపారు. రైతుల ఉద్యమానికి రూ.10,400ను  సీఐటీయూ  నేతలు దుప్పల గోవిందరావు, పి.తేజేశ్వరరావులకు అందజే శారు. కార్యక్రమంలో ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు టేకి ఆచారి, వి.దేవానంద్‌ పాల్గొన్నారు. ఫసోంపేట రూరల్‌: వ్యవసాయ చట్టాలను  రద్దుచేయాలని మామిడిపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో  బుఽధవారం  నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జి.మన్మఽథరావు, టి.పాపారావు, కె.సింహాచలం పాల్గొన్నారు.ఫ సంతకవిటి: కావలిలో ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల పోరాటానికి సంఘీభావంగా బుధవారం  ప్రజాసంఘాలు, టీడీపీ, సీపీఎం  ఆధ్వర్యంలో  రైతులు కిసాన్‌ జ్యోతి కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా  రైతు సంఘ నాయకులు తమ్మినేని రవీంద్రనాయుడు, ఎం.మహేష్‌  మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక చట్టాలను  ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు.

 


Updated Date - 2020-12-17T05:43:14+05:30 IST