డిగ్రీ ప్రవేశాలకు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-11-07T05:14:44+05:30 IST

బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ద్వారా 2020-21 విద్యాసంవత్సరంలో వివిధ డిగ్రీ కోర్సుల్లో (బీఏ, బీకాం, బీఎస్సీ) చేరేందుకు ఈనె ల 12వ తేదీ వరకు గడువు పెంచినట్టు కాశీబుగ్గ ఎస్‌బీఎస్‌వైఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ జి.ఒబులేసు, అధ్యయన కేంద్ర సమన్వయకర్త ఎన్‌.శ్రీనివాస్‌ పట్నాయక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

డిగ్రీ ప్రవేశాలకు గడువు పెంపు


కాశీబుగ్గ, నవంబరు 6: బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ద్వారా 2020-21 విద్యాసంవత్సరంలో వివిధ డిగ్రీ కోర్సుల్లో (బీఏ, బీకాం, బీఎస్సీ) చేరేందుకు ఈనె ల 12వ తేదీ వరకు గడువు పెంచినట్టు కాశీబుగ్గ ఎస్‌బీఎస్‌వైఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ జి.ఒబులేసు, అధ్యయన కేంద్ర సమన్వయకర్త ఎన్‌.శ్రీనివాస్‌ పట్నాయక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఇంట ర్‌/తత్సమాన విద్యార్హతతో పాటు 2017 నుంచి 2020లోగా వర్సిటీ నిర్వ హించిన అర్హత పరీక్ష ఉత్తీర్ణులై ఉన్నవారు, నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌, ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌లో ఉత్తీర్ణత పొందిన వారు దీనికి అర్హులన్నారు. ఆన్‌ లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.

 

Updated Date - 2020-11-07T05:14:44+05:30 IST