తగ్గిన పర్యాటకుల సందడి

ABN , First Publish Date - 2020-07-22T11:42:59+05:30 IST

ఒక వైపు కరోనా, మరోవైపు గతేడాది బీచ్‌ కోతకు గురికావడం వంటి కారణాలతో పోర్టు కళింగపట్నం బీచ్‌కు పర్యాటకుల సందడి పూర్తిగా

తగ్గిన పర్యాటకుల సందడి

నిర్మానుష్యంగా పోర్టుకళింగపట్నం బీచ్‌ 

వెలవెలబోతున్న కాటేజి


 గార: ఒక వైపు కరోనా, మరోవైపు గతేడాది బీచ్‌ కోతకు గురికావడం వంటి కారణాలతో పోర్టు కళింగపట్నం బీచ్‌కు పర్యాటకుల సందడి పూర్తిగా తగ్గిపోయింది. గతేడాది బీచ్‌ కోతకు గురై పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన బొమ్మలన్నీ సముద్రంలో కలసిపోయాయి. ఆ తర్వాత కరోనా వైరస్‌ విస్తరించడంతో బీచ్‌ను సందర్శించేందుకు పర్యాటకులు ఎవరూ రావడం లేదు. దీంతో బీచ్‌లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన కాటేజీ వెలవెలబోతుంది.


ప్రతి శని, ఆదివారాల్లో ఈ బీచ్‌ను పర్యాటకులు చాలా మంది కుటుంబాలతో సహా వచ్చి సందర్శించేవారు.  అలాగే పలువురు ఉన్నతాధికారులు కూడా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఈ బీచ్‌ను సందర్శించేవారు. అయితే, మార్చి నుంచి కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పర్యాటకులు ఎవరూ బీచ్‌కు రాకపోవడంతో నిర్మానుష్యంగా కనిపిస్తోంది.

Updated Date - 2020-07-22T11:42:59+05:30 IST