ధాన్యం కొనుగోలుపై ప్రతిరోజూ నివేదికలు

ABN , First Publish Date - 2020-12-30T06:04:54+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజువారీ కొనుగోలుపై నివేదికలు అందించాలని టెక్కలి సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ తహసీల్దార్‌ ఈశ్వరమ్మను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయశాఖ, కొనుగోలు కేంద్రాలు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ధాన్యం కొనుగోలుపై ప్రతిరోజూ నివేదికలు
అధికారులతో సమీక్షిస్తున్న సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్


జలుమూరు, డిసెంబరు 29: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజువారీ కొనుగోలుపై నివేదికలు అందించాలని టెక్కలి సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ తహసీల్దార్‌ ఈశ్వరమ్మను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయశాఖ, కొనుగోలు కేంద్రాలు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర అందించి రైతులు నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. నిరుపేదలకు ఇళ్ల పట్టాలు వచ్చేనెల 7లోగా అర్హులందరికీ పంపిణీ జరగాలన్నారు. మండలంలో ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణాలకు స్థలాన్ని గుర్తించి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు.  సమావేశంలో డిప్యూటి తహసీల్దారు పి.శ్రీనివాసరావు, వ్యవసాయాధికారి కె.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


లక్ష్యాలను అధిగమించండి 

పోలాకి: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన లెవీ లక్ష్యాలు అధిగమించాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల నియోజకవర్గ ప్రత్యేకాధికారి బి.నగేష్‌ అన్నారు. మంగళవారం వెలుగు కార్యాయలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సహకార సొసైటీ, సభ్యులు, రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 10 ఽధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా పది కేంద్రాల్లో తక్కువ మొత్తంలో ఽధాన్యం కొనుగోలు చేసి వెనుకబడి ఉన్నారని, వారంరోజుల్లో లక్ష్యాలు సాధించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ ఎ.సింహాచలం, డీటీ పొదిలాపు శ్రీనివాసరావు, వ్యవసాయాధికారి సీహెచ్‌ వెంకటరావు, సహకార సొసైటీ సీఈవో బి.రాంబాబు, వెలుగు సీసీలు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2020-12-30T06:04:54+05:30 IST