పదమూడేళ్లుగా వెట్టి చాకిరీ
ABN , First Publish Date - 2020-02-08T09:41:35+05:30 IST
ఏపీ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పదమూడేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో, వెట్టిచాకిరీ పనులు

ఆందోళన వ్యక్తం చేస్తున్న సీఆర్టీలు
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 7: ఏపీ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పదమూడేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో, వెట్టిచాకిరీ పనులు చేయిం చుకుని తమను పక్కన పెట్టారని కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (సీఆర్టీలు) ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు సీఆర్టీల అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏళ్ల తరబడి సీఆర్టీలుగా తాము సేవలం దిస్తున్నామని, అయితే తమను కాదని శాశ్వత పద్ధతిలో నేరుగా ఉద్యోగాలను భర్తీ చేయ డాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వేసిన కమిటీ నివేదిక అందకుండానే ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేయడం దారుణ మన్నారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ గురుకులాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను జీఓ 59 ప్రకారం క్రమబద్ధీకరించారని తెలిపారు. అదే జీఓ ప్రకారం కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని 854 మంది ఆశించా రని, అయితే ప్రస్తుత సీఎం మా ఆశలను అడియాశలు చేశారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని ఆ ప్రకటనలో కోరారు.