కౌన్సెలింగ్ విధానం మార్చకుంటే ఉద్యమం
ABN , First Publish Date - 2020-12-06T05:20:33+05:30 IST
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో త్వరలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్‌కు బదులు మాన్యువల్‌గా చేపట్టాలని, లేకుంటే దశలవారీ ఉద్యమం చేపడతామని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి పేర్కొన్నారు.

ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణమూర్తి
కొండకరకవలస(ఎల్.ఎన్.పేట): రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో త్వరలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్‌కు బదులు మాన్యువల్‌గా చేపట్టాలని, లేకుంటే దశలవారీ ఉద్యమం చేపడతామని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి పేర్కొన్నారు. శనివారం కొండకరకవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త సభ్యత్వాలను స్వీక రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. వెబ్‌కౌన్సిలింగ్ వల్ల సంబంధిత జిల్లా స్థాయి అధికారులు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్థానాలను బ్లాక్ చేసి తమ ఇష్టానుసారం బదిలీలు చేసే అవకాశం ఉందన్నారు. తక్షణం ఈ విధానాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్య దర్శి జి.రమణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు కె. తేజేశ్వరరావు పాల్గొన్నారు.