ఇళ్ల పట్టాకు రూ.10 వేలు డిమాండ్‌

ABN , First Publish Date - 2020-12-29T04:49:19+05:30 IST

ఇళ్ల పట్టాల పంపిణీలో అనర్హులకు పెద్దపీట వేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ కార్యకర్తలే ఆందోళనకు దిగుతున్నారు. అటువంటి ఘటనే పోలాకి మండలం ప్రియాగ్రహారంలో సోమవారం వెలుగుచూసింది. సాక్షాత్‌ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ తనయుడు కృష్ణచైతన్యకు బాధితుల సెగ తగిలింది. గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీకి కృష్ణచైతన్య హాజరయ్యారు. సమావేశంలోనే ఓ యువకుడు ఇళ్ల పట్టా కావాలంటే రూ.10 వేలు ఇచ్చుకోవాల్సిందేనని గ్రామపెద్ద డిమాండ్‌ చేస్తున్నారని ప్రస్తా వించారు. ఆ గ్రామపెద్ద పేరు ప్రస్తావిస్తుండగా స్పందించిన కృష్ణచైతన్య వీఆర్వో, సచివా లయ సిబ్బందిని రప్పించారు. దీనిపై సమ

ఇళ్ల పట్టాకు రూ.10 వేలు డిమాండ్‌


డిప్యూటీ సీఎం తనయుడికి నిరసన సెగ

ప్రియాగ్రహారం(పోలాకి), డిసెంబరు 28: ఇళ్ల పట్టాల పంపిణీలో అనర్హులకు పెద్దపీట వేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ కార్యకర్తలే ఆందోళనకు దిగుతున్నారు. అటువంటి ఘటనే పోలాకి మండలం ప్రియాగ్రహారంలో సోమవారం వెలుగుచూసింది. సాక్షాత్‌ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ తనయుడు కృష్ణచైతన్యకు బాధితుల సెగ తగిలింది.  గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీకి కృష్ణచైతన్య హాజరయ్యారు. సమావేశంలోనే ఓ యువకుడు ఇళ్ల పట్టా కావాలంటే రూ.10 వేలు ఇచ్చుకోవాల్సిందేనని గ్రామపెద్ద డిమాండ్‌ చేస్తున్నారని ప్రస్తా వించారు. ఆ గ్రామపెద్ద పేరు ప్రస్తావిస్తుండగా స్పందించిన కృష్ణచైతన్య వీఆర్వో, సచివా లయ సిబ్బందిని రప్పించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి మంగళవారం ఉదయం నాటికి వివరణ ఇవ్వాలని ఆదేశిం చారు. సమావేశంలోనే స్థానికు లు కొంతమంది పట్టాలకు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నా రని ఫిర్యాదుచేయగా..అక్కడే ఉన్న వైసీపీ మండల నాయకులు తమ్మినాన భూషణరావు, కణితికృష్ణ, సత్తిబాబు, ముద్దాడ బైరాగినాయుడు, కరిమి రాజేశ్వరరావు సర్దిచెప్పి శాంతింపజేయడం కనిపించింది. 



Updated Date - 2020-12-29T04:49:19+05:30 IST