కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం
ABN , First Publish Date - 2020-11-03T06:10:31+05:30 IST
సామాన్యులకు కార్పొరేట్ తరహా వైద్యసేవలను అందిం చేందుకు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం
నరసన్నపేట, నవంబరు 2: సాడమే లక్ష్యం నరసన్నపేట, నవంబరు 2: మాన్యులకు కార్పొరేట్ తరహా వైద్యసేవలను అందిం చేందుకు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పలాసలో 200 పడకల ఆసు పత్రితో పాటు డయా లసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆసుపత్రికి పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిం చడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ బొడ్డేపల్లి సూర్యారావు, సూపరింటెండెంట్ సూ రపు కృష్ణారావు, ఎంపీ ఎంఐడీసీ ఎస్‌ఈ పాపారావు, ఆసుపత్రి అభి వృద్ధి కమిటీ సభ్యులు పి.జగన్, చింతు రామారావు, దాలినాయుడు పాల్గొన్నారు.
భూమిపూజ చేస్తున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్