ఒకేరోజు 346

ABN , First Publish Date - 2020-07-20T12:04:57+05:30 IST

జిల్లాలో ఒకేరోజు 346 కరోనా పాజిటివ్‌ కేసులు, ఎనిమిది మరణాలు సంభవించాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం బులిటెన్‌

ఒకేరోజు 346

రికార్డుస్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు 

ఎనిమిది మరణాలు

ఇప్పటివరకు ఇవే అత్యధికం


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూలై 19: జిల్లాలో ఒకేరోజు 346 కరోనా పాజిటివ్‌ కేసులు, ఎనిమిది మరణాలు సంభవించాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు నమోదైన కేసులు, మరణాల్లో  ఇవే అత్యధికం. దీంతో పాజిటివ్‌ల సంఖ్య జిల్లాలో 2,910కి చేరుకుంది. ఇప్పటివరకు  మొత్తం 1,13,447 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆదివారం ఒక్కరోజు 692 నమూనాలు సేకరించారు. ఇదే రోజు జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 42,  కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నుంచి 87 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.


కాగా, జిల్లాలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ రోజువారీగా గరిష్టంగా 200 లోపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యేవి. మరణాలు కూడా ఒకటి లేదా రెండు జరిగేవి. ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారింది. గడచిన  24 గంటల్లో ఏకంగా 346 పాజిటివ్‌ కేసులు, ఎనిమిది మరణాలు సంభవించడం కలవరపెడుతోంది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా పలాస కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, రాజాం, పాతపట్నం, శ్రీకాకుళం నగరంలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2020-07-20T12:04:57+05:30 IST