తగ్గుముఖం పట్టిన ప్రయాణికులు

ABN , First Publish Date - 2020-03-19T10:07:11+05:30 IST

పలాస రైల్వే స్టేషన్‌లో కరోనా ఎఫెక్ట్‌ పూర్తిగా కనిపిం చింది. ప్రయాణికుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోగా, సాధారణ

తగ్గుముఖం పట్టిన ప్రయాణికులు

పలాస  రైల్వే స్టేషన్‌కు కరోనా ఎఫెక్ట్‌ 

ముందస్తు చర్యలపై మైక్‌లతో ప్రచారం 


పలాస, మార్చి 18: పలాస రైల్వే స్టేషన్‌లో కరోనా ఎఫెక్ట్‌ పూర్తిగా కనిపిం చింది. ప్రయాణికుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోగా, సాధారణ రైళ్లలో సైతం ప్ర యాణికులు లేకపోవడంతో రైళ్లు బోసిపోతున్నాయి. కరోనాపై అప్రమత్తంగా ఉండా లని, గుమిగూడవద్దని, మాస్కులు ధరించాలని, నివారణ చర్యలు తీసుకోవాలంటు సిబ్బంది మైక్‌ ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఫలక్‌నుమా, పూరి-తిరుపతి, ప్ర శాంతి, హౌరామెయిల్‌, కోణార్క్‌, ఇంటర్‌ సిటీ, విశాఖ-భువనేశ్వర్‌ పాసింజరు రైళ్లన్నీ నిత్యం రద్దీగా వెళ్తుండేవి.


అయితే గడచిన రెండు రోజుల నుంచి ప్రయా ణికుల సంఖ్య తగ్గిపోవడంతో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్‌ ఖాళీగా కనిపించింది. ఒడిశా, తెలంగాణాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమో దు కావడంతో రైల్వేశాఖ తీవ్రస్థాయిలో స్పందించి అనేక ఆంక్షలు విధించింది. దైవ దర్శనాలకు వెళ్లేవారు సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వాయిదా వేసుకోవాలని కోరింది. అలాగే ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది ప్రయాణికులు గుమిగూడవద్దని, అనుమా నితులుంటే తమకు తక్షణం సమాచారం ఇవ్వాలని టోల్‌ఫ్రీ నెంబరు విడుదల చేసి అప్రమత్తం చేసింది. రిజర్వేషన్ల కౌంటర్‌కు 20 శాతం కూడా ప్రయా ణికులు రాకపోవడం,  టిక్కెట్‌ కౌంటర్‌ వద్ద ప్రయాణికులు లేకపోవడంతో క్యూలైన్లు ఖాళీగా కనిపించాయి. 

Updated Date - 2020-03-19T10:07:11+05:30 IST