-
-
Home » Andhra Pradesh » Srikakulam » Corona distance with precaution
-
ముందస్తు జాగ్రత్తలతోనే కరోనా దూరం
ABN , First Publish Date - 2020-03-23T09:25:54+05:30 IST
ముందస్తు జాగ్రత్తలతోనే కరో నా వైరస్‌ను దూరం చేయవచ్చని వైద్యాధికారులు ఆది వారం అవగాహన కల్పించారు.

అవగాహన కల్పించిన వైద్యాధికారులు
రేగిడి, మార్చి 22: ముందస్తు జాగ్రత్తలతోనే కరో నా వైరస్‌ను దూరం చేయవచ్చని వైద్యాధికారులు ఆది వారం అవగాహన కల్పించారు. రేగిడి, ఆమదాలవల సల్లో కరోనా వాఽ్యధి నియంత్రణ, జాగ్రత్తలపై రేగిడి పీహెచ్‌సీ సిబ్బంది జనతా కర్ఫ్యూలో భాగంగా మాక్ డ్రిల్లింగ్ నిర్వహించారు. పీహెచ్‌సీ సిబ్బందితోపాటు వైద్యాధికారి స్వర్ణలత ఇళ్లల్లో ఉన్న వారిని కోవిడ్-19 వైరస్ సోక కుండా తీసుకొవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో సుపర్‌వైజర్లు తవిటిమ్మ, పార్వతి, జనార్దనరావు పాల్గొన్నారు.
జి.సిగడాం: ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించవచ్చనని వైద్యా ధికారి పి.హరితాశ్రీ తెలిపారు. ఆదివారం మర్రివ లసలో కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. మర్రి వలసకు చెందిన విక్రం ఉపేంద్ర ఇటీవల సింగపూర్ నుంచి స్వ గ్రామానికి రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ డి.త్రినాఽథం, హెల్త్ అసిస్టెంట్ రమేష్, రవి, హెచ్‌వీలు సుగు ణకుమారి, ఉదయభాషిని, ఏఎన్‌ఎంలు వై.నాగ మణి, చిన్ని పాల్గొన్నారు.