కల్లాల్లోనే మొక్కజొన్న

ABN , First Publish Date - 2020-05-10T08:42:09+05:30 IST

మండలంలో మొక్కజొన్న కొనుగోళ్లు మొక్కుబడిగా సాగుతున్నాయి. దీంతో కల్లాల్లోనే పంటను నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది.

కల్లాల్లోనే మొక్కజొన్న

 మొక్కుబడిగా కొనుగోలు 

 రైతులకు తప్పని ఇబ్బందులు


గార: మండలంలో మొక్కజొన్న కొనుగోళ్లు మొక్కుబడిగా సాగుతున్నాయి. దీంతో కల్లాల్లోనే పంటను నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది.    ఈ రబీ సీజన్‌లో మండలంలోని కళింగపట్నం, శిలగాం, గార, బూరవిల్లి, అం పోలు, శ్రీకూ ర్మం, సానివాడ, తదితర ప్రాంతాల్లో  రైతులు వందలాది ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారు. దీనికోసం వేలాది రూపాయల పెట్టుబడి పెట్టారు. పంట కూడా చేతికి వచ్చింది.


అయితే, గింజలను కొనుగోలు చేసేందుకు అధికారులెవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో  కల్లాలు, రహదా రుల పక్కన గింజలను ఎండబెటి బస్తాల్లో నిల్వ చేస్తున్నారు. తుఫాన్‌ హెచ్చరికలతో పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల అధికారులు మొక్కుబడిగా గింజలను కొనుగోలు చేసి మార్కెట్‌ యార్డులకు తరలిస్తున్నారు. దీనిపై వారిని అడిగితే వే-బిల్లులు రాకపోవడంతో కొనుగోలు చేయలేకపోతున్నామంటూ బదులిస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా గింజలను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2020-05-10T08:42:09+05:30 IST