ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి: స్పీకర్‌ సీతారాం

ABN , First Publish Date - 2020-07-08T11:37:43+05:30 IST

ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కృషిచేసున్నారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. మంగళవా రం ఆమదాలవలస

ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి: స్పీకర్‌ సీతారాం

ఆమదాలవలస: ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కృషిచేసున్నారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. మంగళవా రం ఆమదాలవలస కళాశాల మైదానంలో 104, 108 అత్యవసర సేవల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.


ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో వైద్యసేవలు పొందేందుకు పేదరికం అడ్డురాకూడదనే ఆలోచనతో దివంగత  రాజశేఖరరెడ్డి ఈ సేవలకు  శ్రీకా రం చుట్టారని గుర్తుచేశారు.మూలకుచేరిన  వాహనాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రాణం పోశారన్నారు.  కార్యక్రమంలో వైసీపీ నాయకులు తమ్మినేని నాని, తమ్మినేని శ్రీరామమూర్తి బి.రమేష్‌కుమార్‌, దుంపల శామలరావు,చిరంజీవి, అల్లంశెట్టి ఉమామహేశ్వ రరావు జె.వెంకటేశ్వరరావు ఎండా విశ్వనాధం  పాల్గొన్నారు.

Updated Date - 2020-07-08T11:37:43+05:30 IST