-
-
Home » Andhra Pradesh » Srikakulam » Consciousness with informative images
-
సందేశాత్మక చిత్రాలతోనే చైతన్యం
ABN , First Publish Date - 2020-12-29T05:11:18+05:30 IST
సందేశాత్మక చిత్రాల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావ చ్చని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. ఈ మేరకు సోమవారం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయం వద్ద జయపురం చిత్రం ముహూర్తపు షాట్‌తో ఆమె షూటింగ్‌ను ప్రారంభించారు.

గుజరాతీపేట : సందేశాత్మక చిత్రాల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావ చ్చని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. ఈ మేరకు సోమవారం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయం వద్ద జయపురం చిత్రం ముహూర్తపు షాట్‌తో ఆమె షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు చెందిన నటీనటులతో శ్రీకాకుళం ప్రాంతంలో సినిమా చిత్రీకరణకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. క్లాప్ కొట్టిన వైసీపీ నాయకుడు ధర్మాన రామ్‌మనోహర్ నాయుడు మాట్లాడుతూ సిక్కోలు ఖ్యాతిని చాటిచెప్పేలా చిత్రాన్ని రూపొందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులను అరసవల్లి ఆలయ ప్రధానర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హీరోయిన్ మాధవీరెడ్డి, బరాటం ఉదయ్‌శంకర్‌గుప్తా, విబూది సూరిబాబు, పాలిశెట్టి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.