అచ్చెన్నకు అభినందన

ABN , First Publish Date - 2020-11-14T04:39:34+05:30 IST

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును నిమ్మాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఇచ్ఛాపురం, పాతపట్నం మండలాల టీడీపీ నేతలు కలిసి అభినందించారు.

అచ్చెన్నకు అభినందన
అచ్చెన్నాయుడును అభినందిస్తున్న ఇచ్ఛాపురం నాయకులు

కోటబొమ్మాళి/ఇచ్ఛాపురం, నవంబర్‌ 13: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును నిమ్మాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఇచ్ఛాపురం, పాతపట్నం మండలాల టీడీపీ నేతలు కలిసి అభినందించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. అచ్చెన్నా   యుడును కలిసి వారిలో టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాలిన ఢిల్లేశ్వరరావు తదితరులున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పార్టీ ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు.  అధికారి పార్టీ చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలన్నారు. కాగా బీసీ-డిలో ఉన్న తమ కులాన్ని బీసీ-బిలోకి మార్చేలా కృషి చేయాలని అగూరు కులస్థులు ఆయనకు వినతిపత్రం అందించారు.

Updated Date - 2020-11-14T04:39:34+05:30 IST