-
-
Home » Andhra Pradesh » Srikakulam » Conflict of two factions in flexi formation
-
ఫ్లెక్సీ ఏర్పాటులో ఇరువర్గాల ఘర్షణ
ABN , First Publish Date - 2020-12-28T04:18:38+05:30 IST
రావివలస పంచాయతీ చిన్ననారాయణపురం గ్రామంలో ఆదివారం ఓ ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

12 మందిపై కేసు నమోదు
టెక్కలి రూరల్: రావివలస పంచాయతీ చిన్ననారాయణపురం గ్రామంలో ఆదివారం ఓ ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇది ఓ యువకుడిపై దాడికి దారితీయడంతో 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొందరు యువకులు ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ కడుతుండగా మరో వర్గం అడ్డుకుంది. దీంతో వారి మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేప థ్యంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గంలోని సుమారు నలుగురు యువకులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇప్పిలి దేవేంద్రరావు అనే యువకుడి తలకు గాయమైంది. ఆయన ఫిర్యాదు మేరకు ప్రత్యర్థి వర్గానికి చెందిన 12 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.గోపాలరావు తెలిపారు.