పొగమంచుతో అవస్థలు

ABN , First Publish Date - 2020-12-28T05:25:43+05:30 IST

ఏజెన్సీ చలికి చిగురుటాకులా వణికిపోతోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉదయం పది గంటల వరకూ చలి తీవ్రత అధికంగా ఉంటోంది. పొగమంచు ఆవహిస్తుండడంతో రహదారులపై ఎదుటి వాహనాలు కనిపించడం లేదు. దీంతో ఉదయం 10 గంటలు దాటిన తరువాతే వాహనదారులు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా పలాస-పర్లాకిమిడి, మెళియాపుట్టి- టెక్కలి, గొప్పిలి-గారబంద రూట్లలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గిరిజ నులు చలి మంటలు వేసుకొని సేద దీరుతున్నారు. పెసర,మినుము, నువ్వు వంటి అపరాల సాగు పై పొగ మంచు ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పొగమంచుతో అవస్థలు
పలాస-పర్లాకిమిడి రోడ్డులో విపరీతంగా కురుస్తున్న పొగమంచు




మెళియాపుట్టి :ఏజెన్సీ చలికి చిగురుటాకులా వణికిపోతోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉదయం పది గంటల వరకూ చలి తీవ్రత అధికంగా ఉంటోంది. పొగమంచు ఆవహిస్తుండడంతో రహదారులపై ఎదుటి వాహనాలు కనిపించడం లేదు. దీంతో ఉదయం 10 గంటలు దాటిన తరువాతే వాహనదారులు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా పలాస-పర్లాకిమిడి, మెళియాపుట్టి- టెక్కలి, గొప్పిలి-గారబంద రూట్లలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గిరిజ నులు చలి మంటలు వేసుకొని సేద దీరుతున్నారు. పెసర,మినుము, నువ్వు వంటి అపరాల సాగు పై పొగ మంచు ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.





Updated Date - 2020-12-28T05:25:43+05:30 IST