ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటుపై ఆందోళన

ABN , First Publish Date - 2020-03-24T07:44:12+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ (ఎచ్చెర్ల), ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ (ఎస్‌ఎంపురం)లో కరోనా వైరస్‌ నిర్మూలనలో

ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటుపై ఆందోళన

ఎచ్చెర్ల, మార్చి 23: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ (ఎచ్చెర్ల), ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ (ఎస్‌ఎంపురం)లో కరోనా వైరస్‌ నిర్మూలనలో భాగం గా సోమవారం ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్య లు తీసుకుంటుండగా, ఆయా గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ వర్సిటీలో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుసుకున్న ఎచ్చెర్ల గ్రా మస్థులు పెద్దఎత్తున  అక్కడకు చేరుకొని ఎట్టి పరిస్థి తుల్లో ఇక్కడ ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయొద్దని నినదించారు. జనవాసాల మధ్య ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తే ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతాయోనని ఆందోళన వ్యక్తంచేశారు.


గ్రామానికి వెలుపల ఇలాంటి కేంద్రాలను ఏర్పాటుచేస్తే తమకు ఎలాంటి అభ్యం తరం లేదన్నారు. వర్సిటీ ప్రధాన కార్యాలయం ఎదుట ప్రజలు బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. అలాగే ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో మరో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటుకు పరిశీలించగా, విషయం తెలుసుకున్న ఎస్‌ఎంపురం గ్రామస్థులు ఇక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తంచేశారు. తమ గ్రామానికి సమీపంలో ట్రిపుల్‌ ఐటీలో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటుచేస్తే ఆరోగ్యప రమైన ఇబ్బందులు ఏర్పడతాయని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, గ్రామ స్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 


 జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాల్సి ఉంది

ఈ రెండు కేంద్రాలను సందర్శించిన శ్రీకాకుళం ఆర్డీవో ఎంవీ రమణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1000 మందికి సరిపడేలా ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటుచేయాల్సి ఉందని చెప్పారు. సాఽధారణ స్థితిలో ఉండే వ్యక్తులను మాత్రమే (హోం ఐసోలేషన్‌) ఈ కేంద్రాల్లో ఉంచి, పర్యవేక్షిస్తామని, కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స చేయిస్తామన్నారు. ఈ రెండు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శ్రీకాకుళం డీఎస్పీ మూర్తి, జేఆర్‌పురం సీఐ మల్లేశ్వరరావు, ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.రాజేష్‌ పరిస్థితిని సమీక్షించారు. 

Read more