పొట్టిశ్రీరాములు మార్కెట్ ఆందోళన చేస్తున్న చిరువ్యాపారులు
ABN , First Publish Date - 2020-12-02T04:53:47+05:30 IST
పొట్టిశ్రీరాములు మార్కెట్ ఆందోళన చేస్తున్న చిరువ్యాపారులు
గుజరాతీపేట: శ్రీకాకుళంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్‌కు చెందిన చిరు వ్యాపారులు మంగళవారం ఆందోళనకు దిగారు. కొవిడ్ పేరుతో అధికారులు తమ పొట్ట కొడుతున్నారని వాపోయారు. కొవిడ్ సమయంలో తమ దుకాణాలను నగరంలోని 80 అడుగుల రోడ్డులోని తా త్కాలిక మార్కెట్‌కు తరలించారన్నారు. లాక్‌డౌన్ కొనసాగినంత కాలం వ్యాపారాలు కొంత వరకు సాగాయన్నారు. అనంతరం నిబంధనలు సడ లించి, అన్ని వ్యాపార వర్గాలకు అనుమతివ్వడంతో తాత్కాలిక కూరగా యల మార్కెట్‌కు కొనుగోలుదారులు ఎవరూ రావడం లేదన్నారు. తమ కోసం పొట్టిశ్రీరాములు మార్కెట్‌లో నిర్మించిన దుకాణాలను కేటాయిం చాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలతో తాత్కాలిక మార్కెట్ బుర దగా మారిందన్నారు. ఇదే విషయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధుల వద్ద మొరపె ట్టుకున్నా ప్రయోజనంలేక పోయిందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.