ఫోన్‌ ద్వారానే ఫిర్యాదులు

ABN , First Publish Date - 2020-03-24T07:50:36+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేయడంతో స్పందన కార్యక్రమంను రద్దు చేసినట్టు తహసీల్దార్‌ ఎస్‌.నర్సింహామూర్తి తెలిపారు.

ఫోన్‌ ద్వారానే ఫిర్యాదులు

భామిని, మార్చి 23: రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేయడంతో స్పందన కార్యక్రమంను రద్దు చేసినట్టు తహసీల్దార్‌ ఎస్‌.నర్సింహామూర్తి తెలిపారు. పాలకొండ ఆర్డీవో ఆదేశాల మేరకు సాధారణ ఫిర్యాదులు చేసుకోవాలని సూచించారు. అలాగే ఈనెల 31వ తేదీ వరకు ఎవరూ బయటకు రాకూడదని చెప్పారు.


కార్యాలయానికి సైతం రావద్దని సూచించారు. సాధారణ ఫిర్యాదులకు 9440133641, 7382350532కు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. అలాగే నిత్యవసర సరుకులు అందుబాటుకు 7702203090, 7989823686కు ఫిర్యాదులు చేసుకోవాలన్నారు. ఇతర దేశాలు, రాష్ర్టాల నుంచి వచ్చిన వారికి జలుబు, దగ్గు, కరోనా వైరస్‌ లక్షణాలుంటే 9030376427, 9959293923 నెంబర్‌లకు సమాచారం అందించాలన్నారు. 

Read more