వార్డు వలంటీరుపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-08-01T10:23:11+05:30 IST
మున్సిపాలిటీలోని 11వ వార్డు వలంటీర్‌పై చింతాడ వెంకటరమణ అనే వ్యక్తి శుక్రవారం మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు.

ఆమదాలవలస రూరల్: మున్సిపాలిటీలోని 11వ వార్డు వలంటీర్‌పై చింతాడ వెంకటరమణ అనే వ్యక్తి శుక్రవారం మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి విలేకరులకు గోడును వెల్లబుచ్చాడు. ఎల్.ఎన్.పేట మండలం తురకపేట నుంచి పొట్ట కూటి కోసం మెట్టక్కివలస వచ్చి 11వ వార్డు పుట్టావీధిలో నివాసం ఉంటున్నట్లు చెప్పాడు. తనకు 2819178815 నంబర్‌తో రేషన్ కార్డు ఉందని, దీన్ని అక్కడి నుంచి ఇక్కడకు మార్చుకున్నామని తెలిపాడు. అయితే, రేషన్ సరుకులు అడిగితే వలంటీర్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని వాపోయారు. న్యాయం చేయాలని కమిషనర్‌ను వేడుకుంటున్నట్లు తెలిపారు.