ఆ మార్పు.. రంగులే ‘తెలుపు’!
ABN , First Publish Date - 2020-12-17T05:42:12+05:30 IST
సచివాలయాలకు అధికార వైసీపీ రంగు తొలగించాలని న్యాయస్థానం ఆదేశించినా.. దిమ్మిడిజోల, సైలాడలో మాత్రం రంగులు మారలేదు. ఇదే విషయంపై బుధవారం ఉదయం ‘ఆంధ్రజ్యోతి’ దిమ్మిడిజోల గ్రామాన్ని సందర్శించింది. భవనానికి వైసీపీ రంగులు ఉండడాన్ని గుర్తించింది. మధ్యాహ్నం ఎంపీడీవో బడే రాజేశ్వరరావును వివరణ కోరగా..ఆయన తమ దృష్టికి రాలేదన్నారు. కానీ బుధవారం రాత్రి 9 గంటల సమయానికి భవనం తెలుపు రంగులోకి మారడం విశేషం.

ఆగమేఘాలపై రంగుల మార్పు
దిమ్మిడిజోల సచివాలయానికి వైసీపీ రంగు
ఉదయం ‘ఆంధ్రజ్యోతి’ సందర్శన
రాత్రికి తెలుపు రంగు అద్దిన వైనం
(టెక్కలి)
జిల్లాలో అతిపెద్ద మండలం నందిగాం. మైదాన, కొండల ప్రాంతాల సమాహారం. టెక్కలి నియోజకవర్గంలో గెలుపోటములను తారుమారుచేసే మండలం. ఇక్కడ విధులు నిర్వహించడం కత్తిమీద సాము అని అధికారవర్గాలో అభిప్రాయం. ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు అధికం. ఒక్కోసారి ఉన్నతాధికారులు, న్యాయస్థానాల ఆదేశాలు సైతం బేఖాతరవుతుంటాయి. ఎంతలా అంటే సచివాలయాలకు అధికార వైసీపీ రంగు తొలగించాలని న్యాయస్థానం ఆదేశించినా..ఈ మండలంలోని దిమ్మిడిజోల, సైలాడలో మాత్రం రంగులు మారలేదు. ఇదే విషయంపై బుధవారం ఉదయం ‘ఆంధ్రజ్యోతి’ దిమ్మిడిజోల గ్రామాన్ని సందర్శించింది. భవనానికి వైసీపీ రంగులు ఉండడాన్ని గుర్తించింది. మధ్యాహ్నం ఎంపీడీవో బడే రాజేశ్వరరావును వివరణ కోరగా..ఆయన తమ దృష్టికి రాలేదన్నారు. కానీ బుధవారం రాత్రి 9 గంటల సమయానికి భవనం తెలుపు రంగులోకి మారడం విశేషం.