మెడికల్‌ అసోసియేషన్‌ సేవలు అవసరం

ABN , First Publish Date - 2020-07-28T10:21:59+05:30 IST

వైద్య సేవలతోనే కరోనా నియంత్రణ సాధ్యమని, జిల్లా కొవిడ్‌ ఆస్పత్రిలో సత్ఫలితాలు సాధించేందుకు ఇండియన్‌ మెడికల్‌ ..

మెడికల్‌ అసోసియేషన్‌ సేవలు అవసరం

కలెక్టర్‌ జె. నివాస్‌ 


(కలెక్టరేట్‌, జూలై 27): వైద్య సేవలతోనే కరోనా నియంత్రణ సాధ్యమని, జిల్లా కొవిడ్‌ ఆస్పత్రిలో సత్ఫలితాలు సాధించేందుకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్‌ జె. నివాస్‌ కోరారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యుల సేవలను కొనియాడారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సహకారం బాగుందన్నారు. జిల్లాలో కేసులు  పెరుగుతన్న దృష్ట్యా ఎక్కువ మంది సేవలు అవసరమని, అందుకు వైద్యులను  సమకూర్చాలని కోరారు.  పల్మనాలజిస్ట్‌ల సేవలు అవసరం ఎక్కువగా ఉందన్నారు. స్పెషలిస్టు వైద్యులకు నెలకు రూ.1.50 లక్షలు, ఎంబీబీఎస్‌ వైద్యులకు రూ.75వేల  చొప్పున వేతనం అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సమావేశంలో డ్వామా పీడీ హెచ్‌.కూర్మారావు, డీఎంహెచ్‌వో ఎం.చెంచయ్య, ఏడీఎంహెచ్‌వో బగాది జగన్నాథరావు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సభ్యులు కె.అమ్మన్నా యడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-07-28T10:21:59+05:30 IST