కొవిడ్ మరణాలకు అధికారులదే బాధ్యత
ABN , First Publish Date - 2020-08-11T10:01:39+05:30 IST
కరోనా మరణాలకు సంబంధించి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ నివాస్ స్పష్టం చేశారు.

కలెక్టర్ నివాస్
పొందూరు, ఆగస్టు 10: కరోనా మరణాలకు సంబంధించి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ నివాస్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక అధికారులతో సమీక్షించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అందరి సహకారంతోనే కరోనా నియంత్రణ సాధ్యమని..హాట్‌స్పాట్‌గా ఉన్న పట్టణాలు, మండలాలను గుర్తిస్తున్నామని చెప్పారు.
వలంటీర్లు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. తమ పరిధిలోని 50 ఇళ్ల సమాచారాన్ని సచివాలయానికి అందించాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. వైరస్ లక్షణాలు బయపడిన రెండు రోజుల్లో ఐసోలేషన్ కేంద్రాలకు వస్తే మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి విద్యాసాగర్, తహసీల్దార్ మఽధుసూధనరావు, ఎంపీడీవో రేణుక, డీటీ నారాయణమూర్తి, ఎస్ఐ రామారావు, డాక్టర్ సాగరిక తదితరులు పాల్గొన్నారు.