రైతుల నమోదు తప్పనిసరి

ABN , First Publish Date - 2020-11-28T04:22:20+05:30 IST

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలంటే రైతులు తప్పనిసరిగా తమ వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ నివాస్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రైతుల నమోదు తప్పనిసరి



కలెక్టర్‌ నివాస్‌

గుజరాతీపేట, నవంబరు 27 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలంటే రైతులు తప్పనిసరిగా తమ వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ నివాస్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఖరీప్‌ సీజన్‌లో సుమారు 10 లక్షల టన్నుల ధాన్యం దిగుబడయ్యే అవకాశం ఉంది. ఇందులో 8 లక్షల టన్నులు కొనుగోలు చేసేందుకు లక్ష్యం విధించాం. జిల్లాలోని 811 రైతు భరోసా కేంద్రాలను 246 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేశాం. సాధారణ రకం 100కిలోలకు రూ.1,886, 80కిలోలకు రూ.1,494.40 చొప్పున, ఏగ్రేడు రకం 100కిలోలకు రూ.1,888, 80 కిలోలకు రూ.1,510.40 చొప్పున మద్దతు ధర నిర్ణయించాం. పౌర సరఫరాల శాఖ, వెలుగు, పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లు, కన్స్యూమర్‌ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ స్టోర్స్‌, గవర్నమెంట్‌ ఎంప్లాయిమెంట్‌ కో-ఆపరేటీవ్‌ సొసైటీ,  రైతు సంఘాలు, వ్యవసాయ మార్కెటింగ్‌ సొసైటీ, రైతు ప్రొడ్యూసింగ్‌ ఆర్గనైజేషన్‌ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నాం’ అని కలెక్టర్‌ తెలిపారు.  

Updated Date - 2020-11-28T04:22:20+05:30 IST