అనర్హులకు ‘పట్ట’ం!

ABN , First Publish Date - 2020-12-28T05:22:01+05:30 IST

టెక్కలి డివిజన్‌ కేంద్రంలో అనర్హులకు ఇళ్ల పట్టాలు అందించారా? నేతల అనుచరు లు, వలంటీర్ల బంధువులకు పెద్దపీట వేశారా?..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనిపై వైసీపీ పార్ల మెంటరీ అధ్యక్షురాలు డాక్టర్‌ కిల్లి కృపారాణి సీఎంకు ఫిర్యాదుచేసినట్టు తెలుస్తోంది. అనర్హుల జాబితాపై విచా రణ చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. పట్టణ పేదల కోసం టెక్కలి మేజర్‌ పంచాయతీలో జగతిమెట్ట దరి, శేరివీధి వెనుక, చింతలగార సమీపంలో మూడు లేఅవుట్లను రూపొం దించారు. మొత్తం 1800 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కొందరు అధికార పార్టీ నాయకుల సిఫారసులకే పెద్దపీట వేశారన్న విమర్శలున్నాయి. దీనికితోడు కొందరు వలంటీర్లు తమకు నచ్చినవారు, బంధువుల పేర్లు జాబితాల్లో నమోదుచేసిన ట్టు స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లు వెత్తడంతో కేంద్ర మాజీ మంత్రి కృపారాణి స్పందించారు. అనర్హుల జాబితాతో నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందని సీఎంకు ఫిర్యాదుచేశారు. 160 మంది అర్హులున్నారని..వారిని జాబి తాలో చేర్చాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జాబితా లో చోటుదక్కించుకున్న అనర్హుల గుండెల

అనర్హులకు ‘పట్ట’ం!




సీఎంకు కృపారాణి ఫిర్యాదు

విచారణకు ఆదేశం

టెక్కలి, డిసెంబరు 27: టెక్కలి డివిజన్‌ కేంద్రంలో అనర్హులకు ఇళ్ల పట్టాలు అందించారా? నేతల అనుచరు లు, వలంటీర్ల బంధువులకు పెద్దపీట వేశారా?..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.  దీనిపై వైసీపీ పార్ల మెంటరీ అధ్యక్షురాలు డాక్టర్‌ కిల్లి కృపారాణి సీఎంకు ఫిర్యాదుచేసినట్టు తెలుస్తోంది. అనర్హుల జాబితాపై విచా రణ చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. పట్టణ పేదల కోసం  టెక్కలి మేజర్‌ పంచాయతీలో జగతిమెట్ట దరి, శేరివీధి వెనుక, చింతలగార సమీపంలో మూడు లేఅవుట్లను రూపొం దించారు. మొత్తం 1800 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కొందరు అధికార పార్టీ నాయకుల సిఫారసులకే పెద్దపీట వేశారన్న విమర్శలున్నాయి. దీనికితోడు కొందరు వలంటీర్లు తమకు నచ్చినవారు, బంధువుల పేర్లు జాబితాల్లో నమోదుచేసిన ట్టు స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లు వెత్తడంతో కేంద్ర మాజీ మంత్రి  కృపారాణి స్పందించారు. అనర్హుల జాబితాతో నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందని సీఎంకు ఫిర్యాదుచేశారు. 160 మంది అర్హులున్నారని..వారిని జాబి తాలో చేర్చాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జాబితా లో చోటుదక్కించుకున్న అనర్హుల గుండెల్లో రైళ్లు పరుగె డుతున్నాయి. ఈ విషయంపై తహసీల్దార్‌ శిర్ల గణపతి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా అనర్హుల జాబితాపై దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు ధ్రువీకరించారు.



Updated Date - 2020-12-28T05:22:01+05:30 IST