ప్రశాంతంగా ఐఐటీ, నీట్ ప్రవేశ పరీక్ష
ABN , First Publish Date - 2020-03-16T09:40:20+05:30 IST
ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, అమరావతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐఐటీ, నీట్ అకాడమీ
ఎచ్చెర్ల, మార్చి 15: ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, అమరావతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐఐటీ, నీట్ అకాడమీ 2020-21లో ప్రవేశానికి గాను ఆదివారం దుప్పలవలస బాలయోగి గురుకుల పాఠశాల/కళాశాలలో పరీక్ష నిర్వహించారు.
ఈ పరీక్ష రాసేందుకు జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలల విద్యార్థులు, ఇతర పాఠశాల నుంచి ఎంపీసీ గ్రూపు నుంచి 126 మంది, బైపీసీ గ్రూపు నుంచి 95 మంది ఎంపికయ్యారు. వారిలో ఎంపీసీ నుంచి 122 మంది, బైపీసీ నుంచి 92 మంది ప్రవేశ పరీక్ష రాశారు. ఈ ప్రవేశ పరీక్షకు విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ బి.చంద్రావతి ప్రత్యే కాధికారిగా, నూక రామకృష్ణ (కొల్లివలస) పరిశీలకునిగా వ్యవహ రించారు. దుప్పలవలస కళాశాల ప్రిన్సిపాల్ దువ్వాడ దేవేంద్రరావు పాల్గొన్నారు.