డీసీసీబీ కాలనీలో చోరీ

ABN , First Publish Date - 2020-06-22T11:28:33+05:30 IST

శ్రీకాకుళం నగరంలోని డీసీసీబీ కాలనీలో భారీ చోరీ జరిగింది. రెండో పట్టణ పోలీసుల కథనం మేరకు...డీసీసీబీ కాలనీలో ఆరంగి రామచంద్రరావు

డీసీసీబీ కాలనీలో చోరీ

ఏడు తులాల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి  అపహరణ


శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి: శ్రీకాకుళం నగరంలోని డీసీసీబీ కాలనీలో భారీ చోరీ జరిగింది.  రెండో పట్టణ పోలీసుల కథనం మేరకు...డీసీసీబీ కాలనీలో  ఆరంగి రామచంద్రరావు తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో ఈనెల 16న విశాఖపట్నం వెళ్లాడు. శనివారం రాత్రి  తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపు తాళం పగులగొట్టి ఉండడాన్ని గుర్తించారు.


వెంటనే బీరువాలోని బంగారు ఆభరణాలు పరిశీలించారు. ఏడు తులాలు బంగారు ఆభరణాలు,  50 తులాల వెండి ఆభరణాలు, రూ.90 వేలు నగదు చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో డయల్‌ 100కు ఫిర్యాదుచేశారు. ఆదివారం రెండో పట్టణ పోలీసులు, క్లూస్‌టీం, పోలీసు జాగిలాలు చోరీ జరిగిన ప్రాంతానికి వెళ్లి ఆధారాలు సేకరించాయి. రామచంద్రరావు భార్య హేమలత ఫిర్యాదు మేరకు టుటౌన్‌ ఎస్‌ఐ ముకుందరావు కేసు నమోదుచేసి విచారణ చేపడుతున్నారు.

Updated Date - 2020-06-22T11:28:33+05:30 IST