మహిళల స్వావలంబనకు ‘చేయూత’

ABN , First Publish Date - 2020-12-02T04:57:24+05:30 IST

మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎస్‌ఆర్‌ చేయూత తోడ్పడుతుందని మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌ తెలిపారు.

మహిళల స్వావలంబనకు ‘చేయూత’
మాట్లాడుతున్న కిరణ్‌ కుమార్‌

మెప్మా పీడీ కిరణ్‌ కుమార్‌ 

ఆమదాలవలస:మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎస్‌ఆర్‌ చేయూత తోడ్పడుతుందని మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం మునిసిపల్‌ కార్యాలయంలో మెప్మా సిబ్బంది, వార్డు సంక్షేమ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయూత లబ్ధిదారులను  బ్యాంకులకు అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. హెచ్‌యూఎల్‌, ఐటీసీ  వంటి కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందాలు వల్ల మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని చెప్పారు.  కార్యక్రమంలో మెప్మా సిబ్బంది అమ్మినాయుడు, నాగమణి, రాజేష్‌ పాల్గొన్నారు.ఫ ఇచ్ఛాపురం: జీవనోపాధి మెరుగుపరచుకోవడానికి వైఎస్‌ఆర్‌ చేయూత ఎంతగానో దోహదపడుతుందని మెప్మా డీఎంసీ  కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురంలో వైఎస్‌ఆర్‌ చేయూత పథకం లబ్ధిదా రులకు వ్యాపారాఽభివృద్ధిపై  అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో మెప్మా సీఎ ంఎం జానికిరామారావు, సీవోలు బాలరాజు, సంతోష్‌ పాల్గొన్నారు. ఫ పొందూరు: మహిళలు ఆర్థికంగా ఎదిగాలని పంచాయతీ ఈవో అనూరాధ, బెజ్జిపురం యూత్‌క్లబ్‌ సంస్థ అధ్యక్షుడు ఎం.ప్రసాదరావు  తెలిపారు. మంగళవారం పొందూరులో  బెజ్జిపురం యూత్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లైవ్‌లీహుడ్‌ జీవనోపాధుల శిక్షణ  కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  30 మంది మహిళలకు అప్కిక్‌ వర్క్‌లో 15 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 



Updated Date - 2020-12-02T04:57:24+05:30 IST