ఉపాధ్యాయ బదిలీ షెడ్యూల్‌ మార్పు

ABN , First Publish Date - 2020-11-27T04:58:41+05:30 IST

ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ను మార్పు చేస్తూ ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల 28 నుంచి డిసెంబర్‌ 24 వరకు 27 రోజుల పాటు బదిలీలకు వివిధ దశలు ని ర్దేశించింది. నిబంధనల్లో మార్పులు... దాని ప్రకారం ప్రొవిజనల్‌ సీనియార్టీ జాబితా రూపకల్పనకు సమయం పట్టనుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఉపాధ్యాయ బదిలీ షెడ్యూల్‌ మార్పు

ఉపాధ్యాయ బదిలీ షెడ్యూల్‌ మార్పు 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, నవంబర్‌ 26: ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ను మార్పు చేస్తూ ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల  28  నుంచి డిసెంబర్‌ 24 వరకు 27 రోజుల పాటు బదిలీలకు వివిధ దశలు ని ర్దేశించింది. నిబంధనల్లో మార్పులు... దాని ప్రకారం ప్రొవిజనల్‌ సీనియార్టీ జాబితా రూపకల్పనకు సమయం పట్టనుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పాత షెడ్యూల్‌ ప్రకారం ఇప్పటికే ప్రొవిజనల్‌ సీనియార్టీ జాబితా ప్రదర్శన ముగియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ నెల  30 నుంచి డిసెంబర్‌ 2 వరకూ గడువు పెంచింది.  వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునే గడువు ను   పెంచింది. పాత షెడ్యూల్‌ ప్రకారం వెబ్‌ ఆప్షన్ల కోసం ఉపాధ్యాయులకు మూడు రోజుల వ్యవధి ఇవ్వగా... ప్రస్తుతం డిసెంబర్‌ 11  నుంచి 15 వరకూ  అవకాశం కల్పించింది. స్టేషన్‌ సర్వీసుకు పూర్తి పాయింటు ్ల(ఎనిమిదేళ్ల నిబంధన తొలగింపు), గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్ల స్టేషన్‌ సర్వీస్‌ పూర్తయితేనే కచ్చితంగా బదిలీ(అయిదేళ్ల అకడమిక్‌ సంవత్సరాల నిబంధన తొలగింపు) వంటి నిబంధనల మార్పుతో బదిలీల జాబితాలో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. పలువురు ఉపాధ్యాయులకు తమ సర్వీసుకు అనుగుణంగా పాయింట్లు పెరగనున్నాయి. కొంతమంది ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరి బదిలీల నుంచి మినహాయింపు లభించనుంది. బదిలీ నిబంధనల సవరణ ఉత్తర్వుల ప్రకారం జాబితా రూపొందించడంపై జిల్లా విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. 


 కొత్త షెడ్యూల్‌ ఇలా... 

-  ఈ నెల 28, 29 తేదీల్లో బదిలీ దరఖాస్తుల పరిశీలన

- ఈ నెల 30 నుంచి డిసెంబర్‌ 2వరకు.. పాయింట్ల ఆధారంగా ప్రొవిజనల్‌ సీనియార్టీ జాబితా ప్రదర్శన 

-డిసెంబర్‌ 3, 4 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ. 

- 5, 6, 7 తేదీల్లో అభ్యంతరాలకు జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలన. 

-8, 9, 10 తేదీల్లో పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ జాబితా ప్రదర్శన

- 11, 12, 13, 14, 15 తేదీల్లో వెబ్‌ఆప్షన్లకు అవకాశం 

-16, 17, 18, 19, 20, 21 తేదీల్లో బదిలీ ఉత్తర్వుల ప్రదర్శన. 

-ఒకవేళ టెక్నికల్‌ ఇబ్బందులు ఎదురైతే 22, 23 తేదీల్లో అభ్యర్థనల స్వీకరణ 

 -డిసెంబర్‌ 24న బదిలీ ఉత్తర్వుల డౌన్‌లోడ్‌కు అవకాశం. 

 

Updated Date - 2020-11-27T04:58:41+05:30 IST