ఏకాదశి శోభ

ABN , First Publish Date - 2020-12-26T05:12:04+05:30 IST

వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. అరసవల్లి ఆదిత్యుడి ఆలయంతో పాటు రామమందిరాలు, వేంకటేశ్వర, జగన్నాథస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అరసవల్లిలో నిర్వహించిన తిరువీధి ఉత్సవంలో అధికసంఖ్యలో పాల్గొన్నారు. తిరువీధి అనంతరం ఉత్తర ద్వారం గుండా.. ఆలయంలోకి భక్తులను అనుమతించారు.

ఏకాదశి శోభ
ఆదిత్యుడి ఉత్సవ మూర్తులను ఊరేగిస్తున్న దృశ్యం

ఆలయాల్లో బారులుదీరిన భక్తులు 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, డిసెంబరు 25 : వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. అరసవల్లి ఆదిత్యుడి ఆలయంతో పాటు రామమందిరాలు, వేంకటేశ్వర, జగన్నాథస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అరసవల్లిలో నిర్వహించిన తిరువీధి ఉత్సవంలో అధికసంఖ్యలో పాల్గొన్నారు. తిరువీధి అనంతరం ఉత్తర ద్వారం గుండా.. ఆలయంలోకి భక్తులను అనుమతించారు. ఆలయ అనివెట్టి మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామికి వైభవంగా కల్యాణం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. వరద వెంకట గోవిందరాజులు కుటుంబ సభ్యులు స్వామి మకర తోరణానికి రూ.2లక్షలు విరాళం అందజేశారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ,  ఈవో హరిసూర్యప్రకాష్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.  శ్రీకాకుళం పీఎన్‌కాలనీలోని నారాయణ తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వారం గుండా స్వామిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కృష్ణా పార్క్‌ రామమందిరం వద్ద భక్తుల సందడి కనిపించింది.   


Updated Date - 2020-12-26T05:12:04+05:30 IST