నిఘా నిద్దరోతోంది!

ABN , First Publish Date - 2020-07-28T10:27:26+05:30 IST

రాష్ట్ర సరిహద్దులోని ఇచ్ఛాపురం పట్టణంలో నేరగాళ్ల కట్టడి చేసేందుకు గతంలో ఏర్పా టు చేసిన అత్యాధునిక సీసీ కెమెరాలు ప్రస్తుతం ..

నిఘా నిద్దరోతోంది!

ఇచ్ఛాపురంలో పనిచేయని సీసీ కెమెరాలు

 నిర్వహణ లోపంతో నీరుగారుతున్న సాంకేతికత


ఇచ్ఛాపురం : రాష్ట్ర సరిహద్దులోని ఇచ్ఛాపురం పట్టణంలో నేరగాళ్ల కట్టడి చేసేందుకు గతంలో ఏర్పా టు చేసిన అత్యాధునిక సీసీ కెమెరాలు ప్రస్తుతం  పనిచేయడంలేదు. 2016లో అప్పటి జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డి ఆదేశాల పట్టణ ప్రధాన కూడళ్లతో పాటు  వివిధ కూడళ్లు, బ్యాంకులు, పోలీస్‌స్టేషన్‌ పరిసరాల్లో ఏర్పా టుచేశారు.  ప్రజాశ్రేయస్సు దృష్ట్యా వ్యాపారులు,  వి ద్యాసంస్థల యాజమాన్యాలు, పారిశ్రామిక వేత్తల ఆర్థి కసాయంలో అత్యాధునిక  సీసీ కెమెరాలను  ఏర్పాటు చేశారు.


పట్టణం మొత్తం ని ఘా నీడల  ఉంచారు.  చిన్న గొడవలు, ప్రమాదాలు, చోరీలను కెమెరాల ఫుటేజీ ఆధా రంగా పరిష్కరిస్తుండేవారు. కొన్ని చోరీ కేసుల్లో నిఘా నేత్రాలు తమ వంతు పాత్ర పోషించాయి. వాటి నిర్వహణపై అధికారులు దృష్టిపెట్టకపోవడంతో అవి అలంకారప్రాయంగా ఉన్నాయి. దీనిపై సీఐ వినోద్‌బాబు స్పంది స్తూ.. సంబంధిత  సాంకేతిక నిపుణులు అందుబాటులో లేకపోవడంతో బాగుచేయించలేకపోయాం. త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు.

Updated Date - 2020-07-28T10:27:26+05:30 IST