-
-
Home » Andhra Pradesh » Srikakulam » Cashew price reduced by 30
-
30 శాతం తగ్గిన జీడిపప్పు ధర!
ABN , First Publish Date - 2020-12-30T05:59:18+05:30 IST
కరోనా ప్రభావం పలాస జీడి పరిశ్రమలపై పడింది. జీడి ఉత్పత్తుల క్రయ విక్రయాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న ధరతో పోల్చుకుంటే జీడి పప్పు ధర 30 శాతానికి పడిపోయింది. వచ్చే ఏడాది ఆశించినంత ఫలితాలు ఉండవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు. పలాస నియోజకవర్గంలో 250కు పైగా జీడి పరిశ్రమలు, 500 మంది వరకు జీడి వ్యాపారులు ఉన్నారు. ఒక్కో పరిశ్రమ రోజుకు సగటున 10 బస్తాల జీడి పిక్కలు పీలింగ్ చేస్తుంటారు. దీని ప్రకారం రోజూ 2,500 బస్తాలు (80 కిలోల బరువు) పీలింగ్ చేస్తుంటారు. ఒక్కో బస్తాకు పిక్కల నాణ్యతను బట్టి 22 నుంచి 24 కిలోల జీడి పప్పు తయారవుతుంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఒకటో నెంబరు జీడి పప్పు రూ.680 నుంచి రూ.720 వరకు ధర పలుకుతోంది. లాక్‌డౌన్ ముందు కిలో జీడి పప్పు రూ.810 వరకు వెళ్లింది.

పరిశ్రమల నిర్వహణపై ప్రభావం
కార్మికులకు ఉపాధి దూరం
(పలాస)
కరోనా ప్రభావం పలాస జీడి పరిశ్రమలపై పడింది. జీడి ఉత్పత్తుల క్రయ విక్రయాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న ధరతో పోల్చుకుంటే జీడి పప్పు ధర 30 శాతానికి పడిపోయింది. వచ్చే ఏడాది ఆశించినంత ఫలితాలు ఉండవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు. పలాస నియోజకవర్గంలో 250కు పైగా జీడి పరిశ్రమలు, 500 మంది వరకు జీడి వ్యాపారులు ఉన్నారు. ఒక్కో పరిశ్రమ రోజుకు సగటున 10 బస్తాల జీడి పిక్కలు పీలింగ్ చేస్తుంటారు. దీని ప్రకారం రోజూ 2,500 బస్తాలు (80 కిలోల బరువు) పీలింగ్ చేస్తుంటారు. ఒక్కో బస్తాకు పిక్కల నాణ్యతను బట్టి 22 నుంచి 24 కిలోల జీడి పప్పు తయారవుతుంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఒకటో నెంబరు జీడి పప్పు రూ.680 నుంచి రూ.720 వరకు ధర పలుకుతోంది. లాక్‌డౌన్ ముందు కిలో జీడి పప్పు రూ.810 వరకు వెళ్లింది. అదే స్థాయిలో ఏడాదంతా జీడి రేట్లు స్థిరంగా ఉంటాయని భావించిన వ్యాపారులకు కరోనా కారణంగా ఉన్న నిల్వలు చెల్లకపోవడంతో దొరికిన రేటుకు పప్పు అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లినట్టు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో మెల్లమెల్లగా జీడి పరిశ్రమలు నడిపిస్తున్నారు. ఉత్పత్తిని తగ్గించుకొని ఉన్నంతలో వెనువెంటనే అమ్మకానికి పెడుతున్నారు. మరోమారు లాక్‌డౌన్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారంతో తయారైన పప్పును నిల్వ చేయకుండా అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో బ్రోకర్లు రేట్లు తగ్గించి పప్పును కొనుగోలు చేస్తుండడం విశేషం. జీడి కార్మికులదీ అదే దయనీయం. నెలల తరబడి ఉపాధి కోల్పోయారు. సుమారు 20 వేల కార్మిక కుటుంబాలు జీడి పరిశ్రమలపై ఆధారపడి బతుకుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే పరిశ్రమలు ప్రారంభం కావడంతో పనులకు వెళ్తున్నారు.