డీలర్‌పై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-12-06T05:17:12+05:30 IST
ఆమదాలవ లస మునిసిపాలిటీ పరిధి మేదరవీధిలో గల రేషన్ దుకాణం డీలర్‌పై రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేశారు. ఆర్ఐ ఎం.సతీష్‌కుమార్, వీఆర్వో బి.నారాయణమూర్తి ఆధ్వర్యంలో శనివారం డిపోలో తని ఖీలు చేపట్టారు.

ఆమదాలవలస : ఆమదాలవ లస మునిసిపాలిటీ పరిధి మేదరవీధిలో గల రేషన్ దుకాణం డీలర్‌పై రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేశారు. ఆర్ఐ ఎం.సతీష్‌కుమార్, వీఆర్వో బి.నారాయణమూర్తి ఆధ్వర్యంలో శనివారం డిపోలో తని ఖీలు చేపట్టారు. నిల్వ ఉన్న సరుకు లకు, రికార్డుల్లో ఉన్న వివరాలకు పొంతన లేకపోవడాన్ని గుర్తించినట్టు వారు తెలిపారు. దీంతో డీలర్ పి.రమేష్‌పై 6ఏ కేసు నమోదు చేసినట్టు చెప్పారు. చర్యలకు ఉన్నతాధికారు లకు నివేదించినట్టు తెలిపారు.