నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వలంటీర్లను తొలగించండి
ABN , First Publish Date - 2020-09-18T09:36:39+05:30 IST
కొవిడ్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న నౌపడ సచివాలయం పరిధిలోని వలంటీర్లను తొలిగించాలని జేసీ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం ఆయన సంతబొమ్మాళి, మర్రిపాడు,

జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశం
సంతబొమ్మాళి,సెప్టెంబరు17: కొవిడ్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న నౌపడ సచివాలయం పరిధిలోని వలంటీర్లను తొలిగించాలని జేసీ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం ఆయన సంతబొమ్మాళి, మర్రిపాడు, నౌపడ సచివాలయాలను సందర్శించారు. నౌపడ సచివాలయంలో ఈ నెల 13 నుంచి 16 వరకు విధులకు సక్రమంగా హాజరుకాని వలంటీర్లను తొల గించి, వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని ఎంపీడీవో రాజేశ్వర రావును ఆదేశించారు.
గ్రామాల్లో అఽధికారులు సమన్వయంతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాల యాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం 24 గంటలు పనిచేయలన్నారు. కొవిడ్ పరీక్షలు చేసుకోవడానికి ముందుకు రాని వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని తహసీల్దార్ రాంబాబును ఆదేశించారు.