భూ సర్వే సక్రమంగా చేపట్టండి

ABN , First Publish Date - 2020-12-20T04:53:16+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వ్యవసాయ భూముల రీ సర్వే ప్రక్రియ నిర్వహించాలని శ్రీకాకుళం ఆర్డీవో కిశోర్‌ ఆదేశించారు.

భూ సర్వే సక్రమంగా చేపట్టండి
సర్వే సిబ్బందికి సూచనలిస్తున్న ఆర్డీవో కిశోర్‌


 శ్రీకాకుళం ఆర్డీవో కిశోర్‌ 

కొండలక్కివలస(పోలాకి) డిసెంబరు 19:  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వ్యవసాయ భూముల రీ సర్వే ప్రక్రియ నిర్వహించాలని శ్రీకాకుళం ఆర్డీవో  కిశోర్‌ ఆదేశించారు. సంతలక్ష్మీపురం రెవెన్యూ పరిధి కొండలక్కివలసను రీ సర్వేకు పైలట్‌ ప్రాజెక్టు కింద చేపడుతుండడంతో  శనివారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ‘మీ భూమి-మా హా మీ’ నినాదంతో భూముల రీ సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ఈనెల 21 న ఈ ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమవుతుందన్నారు. హక్కు భూమిని అప్పగించి సర్వే రాళ్లు, పాతి హద్దులు వేయాలని సూచించారు. సర్వే వివాదాలు రాకుండా పక్కాగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో భూ రీ సర్వే జిల్లా బృంద పరిశీలకులు ఈశ్వరదొర, వి.కొండలరావు, వెంకటరావు, తహసీల్దార్‌ ఎ.సింహాచలం, పోలాకి-2 సచివాలయ సర్వేయర్‌ దిలీప్‌కుమార్‌, మండల సర్వేయర్‌ ఎం.శ్రీరామమూర్తి, ఆర్‌ఐ కోటేశ్వరారవు తదితరులు పాల్గొన్నారు.  

Read more