ఉపాధి పనులు ముమ్మరంగా చేపట్టండి

ABN , First Publish Date - 2020-02-08T09:53:42+05:30 IST

జిల్లాలో ఉపాధి హామీ పనులు ము మ్మరంగా చేపట్టాలని గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్‌ కమిషనర్‌ ఎస్‌. పోలప్ప ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం జడ్పీ సమావేశ మందిరం

ఉపాధి పనులు ముమ్మరంగా చేపట్టండి

గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్‌ కమిషనర్‌ పోలప్ప


గుజరాతీపేట, ఫిబ్రవరి 7 : జిల్లాలో ఉపాధి హామీ పనులు ము మ్మరంగా చేపట్టాలని గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్‌ కమిషనర్‌ ఎస్‌. పోలప్ప ఆదేశించారు. ఈమేరకు  శుక్రవారం  జడ్పీ సమావేశ మందిరం లో ఉపాధి హామీ సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో  గరిష్ఠంగా 3.87 లక్షల మం ది వేతనదారులు పనులకు వస్తున్నారని తెలిపారు. వీరిలో 80 శాతం మంది వేతనదారులు  వంద రోజుల పనిదినాలు పూర్తిచేసేలా క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు చేపట్టాలని  సూచించారు.  ప్రధానంగా ఇళ్ల స్థలాల అభి వృద్ధి పనులు ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేసి అప్పగించాలని ఆదేశించారు.  ఉద్యానవన నిధుల వినియోగంపై దృష్టి సారించాలన్నారు. ఎప్పటికప్పుడు ప్లానిటేషన్‌ పనులకు సంబంధించి చెల్లింపులు  చేయాలన్నారు.  జిల్లాలో రూ.247 కోట్ల విలువైన మెటీరియల్‌ పనులు చేపట్టాల్సి ఉందనీ.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తిచేయాలని  నిర్ధేశించారు.  జాబ్‌కార్డులకు ఆధార్‌ ఫీడింగ్‌ తప్పనిసరిగా చేయాలన్నారు. ఎఫ్‌టీవో అప్‌లోడింగ్‌ 100 శాతం పూర్తిచేయాలని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో డ్వామా పీడీ హ నుమంతు కూర్మారావు, అదనపు పథక సంచాలకులు బి.లక్ష్మీపతి, సంజ య్‌, విజిలెన్స్‌ అధికారి వెంకట్‌ రామన్‌, కార్యక్రమ అధికారి కేవీ అప్పలనా యుడు, పర్యవేక్షకుడు జాన్‌సన్‌ హెండ్రీ, కార్యాలయ సిబ్బంది, ఏపీవోలు, ఈసీలు, సాంకేతిక సహాయకులు, ఏపీడీలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-08T09:53:42+05:30 IST