జీవో-77ను వెంటనే రద్దు చేయండి

ABN , First Publish Date - 2020-12-29T05:05:47+05:30 IST

పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో 77ను తక్షణమే రద్దు చేయాలని తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి భాస్కరరావు డిమాండ్‌ చేశారు. స్థానిక అంబేడ్కర్‌ జంక్షన్‌లో సోమవారం యూనియన్‌ ఆధ్వర్యంలో జీవో కాపీలను దహనం చేశారు.

జీవో-77ను వెంటనే రద్దు చేయండి
జీవో కాపీలు చూపిస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యం

గుజరాతీపేట : పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో 77ను తక్షణమే రద్దు చేయాలని తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి భాస్కరరావు డిమాండ్‌ చేశారు. స్థానిక అంబేడ్కర్‌ జంక్షన్‌లో సోమవారం యూనియన్‌ ఆధ్వర్యంలో జీవో కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ 2020-21 విద్యాసంవత్సరంలో ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కళాశాలల్లో చదువుతున్న పీజీ, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల విద్యార్థులకు జగనన్న వసతి దీవెన, విద్యాదీవెనలు వర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో విడుదల చేయడం దారుణమన్నారు. దీనిని తక్షణమే ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా సెక్రటరీ కె.సంధ్య, రోణంకి కల్యాణ్‌కుమార్‌, శ్రీనివాసరావు, అప్పలనాయుడు, మణికంఠ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T05:05:47+05:30 IST