తెప్పోత్సవానికి బ్రేక్‌!

ABN , First Publish Date - 2020-11-27T05:08:04+05:30 IST

ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడి తెప్పోత్సవానికి బ్రేక్‌ పడింది. వర్షం కారణంగా ఆలయ అధికారులు తెప్పోత్సవాన్ని నిలిపేశారు. చిలుక ద్వాదశిని పురస్కరించుకుని గురువారం అరసవల్లిలో ఆదిత్యుడి తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో భక్తులకు అనుమతి లేకుండా ఈ ఉత్సవాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

తెప్పోత్సవానికి బ్రేక్‌!
ఇంద్ర పుష్కరిణిలో ఖాళీగా హంస వాహనం

 వర్షం కారణంగా నిలిచిన ఆదిత్యుడి ఉత్సవం

గుజరాతీపేట, నవంబరు 26: ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడి తెప్పోత్సవానికి బ్రేక్‌ పడింది. వర్షం కారణంగా ఆలయ అధికారులు తెప్పోత్సవాన్ని నిలిపేశారు. చిలుక ద్వాదశిని పురస్కరించుకుని గురువారం అరసవల్లిలో ఆదిత్యుడి తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో భక్తులకు అనుమతి లేకుండా ఈ ఉత్సవాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఆలయ సమీపంలో ఉన్న ఇంద్రపుష్కరిణిలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు హంస వాహనాన్ని సిద్ధం చేశారు. గురువారం ఉదయం నుంచీ వర్షం కురుస్తుండడంతో తెప్పోత్సవం నిర్వహించేందుకు సాధ్యపడలేదు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. గురువారం కూడా ఆదిత్యుడికి బంగారు ఆభరణాలను అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ అపురూప దృశ్యాన్ని తిలకించి..పులకించిపోయారు.

 

Updated Date - 2020-11-27T05:08:04+05:30 IST