విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనం అవసరం

ABN , First Publish Date - 2020-12-07T04:41:27+05:30 IST

విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనం అలవరచుకోవాల్సిన అవసరం ఉందని ఎంఈవో బి.మాధవరావు అన్నారు. స్థానిక గ్రంథాలయంలో ఆదివారం ‘చదవడం నాకిష్టం’ కార్యక్రమం నిర్వహించారు.

విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనం అవసరం
నందిగాం గ్రంథాలయంలో పుస్తకపఠనం చేస్తున్న విద్యార్థులు

జలుమూరు, డిసెంబరు 6: విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనం అలవరచుకోవాల్సిన అవసరం ఉందని ఎంఈవో బి.మాధవరావు అన్నారు. స్థానిక గ్రంథాలయంలో ఆదివారం ‘చదవడం నాకిష్టం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాలల్లో విలువైన, విజ్ఞానదాయకమైన గ్రంథాలను చదవడం ద్వారా ఉజ్వల భవిష్యత్‌ను పొందవచ్చన్నారు. ప్రతిరోజూ ఒక గంట కాలం పుస్తక పఠనానికి కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సీఆర్పీ పట్ట వైకుంఠరావు, గ్రంథాలయాధికారి ఢిల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 


 నందిగాం: నందిగాం శాఖా గ్రంథాలయంలో ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మెయిన్‌ పాఠశాల హెచ్‌ఎం పి. మల్లేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం విద్యార్థులు గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కె.రామకృష్ణ, హిందీ ఉపాధ్యాయుడు పీవీ రమణ మూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.


 మెళియాపుట్టి: విద్యార్థులు పుస్తకాలను చదవడం అలవరచుకోవాలని ఎంఈవో ఎస్‌.దేవేంద్రరావు అన్నారు. ఆదివారం స్థానిక గ్రంథాలయంలో ‘చదవటం మాకిష్టం’ కార్య క్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఆదివారం గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు, పత్రికలు చదవడం ద్వారా ప్రపంచ విజ్ఞానం తెలుసుకోవాలన్నారు. దీనివల్ల భవిష్యత్‌లో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.   గ్రంథాలయాధికారి కె,రాజు, చిన్నబాబు, కృషమూర్తి పాల్గొన్నారు. 

 

 

Read more