ముగిసిన బీజేపీ శిక్షణ తరగతులు

ABN , First Publish Date - 2020-11-26T05:19:26+05:30 IST

బీఎస్‌అండ్‌జేఆర్‌ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రెండు రోజులుగా జరుగుతున్న టెక్కలి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. మండలశాఖ అధ్యక్షుడు గూన మీనాకుమార్‌ ఆధ్వర్యంలో పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు.

ముగిసిన బీజేపీ శిక్షణ తరగతులు

టెక్కలి : బీఎస్‌అండ్‌జేఆర్‌ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రెండు రోజులుగా జరుగుతున్న టెక్కలి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. మండలశాఖ అధ్యక్షుడు గూన మీనాకుమార్‌ ఆధ్వర్యంలో పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అట్టాడ రవిబాబ్జీ, మన్మధరావు, రాజారావు, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. ఫ హరిపురం : రానున్న ఎన్నికల్లో తెలుగురాషాల్లో బీజేపీ  అఽధికారం చేపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యాక్షులు పైడి వేణుగోపాలం తెలిపారు. బుధవారం మందస మండలంలోని హరిపురంలో బీజేపీ నాయకుడు కొర్ల కన్నారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు అట్టాడ రవిబాబ్జీ, మాజీ ఎంపీ కణితి విశ్వనాఽథం పాల్గొన్నారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 50 మంది బీజేపీలో చేరారు. 

Read more