-
-
Home » Andhra Pradesh » Srikakulam » BJP concerns over statue demolition
-
విగ్రహం ధ్వంసంపై బీజేపీ ఆందోళన
ABN , First Publish Date - 2020-12-31T05:25:19+05:30 IST
విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం చేయడంపై బీజేపీ నాయ కులు బుధవారం ఆందో ళన చేశారు.

గార: విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం చేయడంపై బీజేపీ నాయ కులు బుధవారం ఆందో ళన చేశారు. పార్టీ మం డల అధ్యక్షుడు ఆరంగి తిరుపతిరావు ఆధ్వర్యంలో గార మూడు రోడ్ల కూడలి వద్ద భైఠాయించి నిరసన తెలిపారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్ ప్రముఖ్ చింతు పాపారావు, నాయకులు పండి యోగేశ్వరరావు, మైలపిల్లి అప్పారావు, అరవల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.