సంక్షేమం పేరుతో సంక్షోభం దిశగా రాష్ట్రం

ABN , First Publish Date - 2020-11-26T05:54:34+05:30 IST

రాష్ట్రానికి రూపాయి కూడా ఆదాయం రాకుండా అప్పులు చేస్తూ.. సంక్షేమం పేరుతో సంక్షోభం దిశగా పయనిం పజేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

సంక్షేమం పేరుతో సంక్షోభం దిశగా రాష్ట్రం
శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మాధవ్‌

 ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌

  ’పేట’లో ప్రారంభమైన  ప్రశిక్షణ తరగతులు

పాయకరావుపేట, నవంబరు 25 : రాష్ట్రానికి రూపాయి కూడా ఆదాయం రాకుండా అప్పులు చేస్తూ.. సంక్షేమం పేరుతో సంక్షోభం దిశగా పయనిం పజేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. బుధవారం ఇక్కడ బీజేపీ నాయకుడు తోట నగేశ్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన బీజేపీ సంస్థాగత శిక్షణ తరగతుల్లో మాట్లాడారు. బీజేపీ సంస్థాగత ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, ఈ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన వారికి శిక్షణ కార్యక్రమాల ద్వారా పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభు త్వం, ఇపుడు వైసీపీ ప్రభుత్వం ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నాయని మండిపడ్డార రాష్ట్రంలో మతపరమైన, ఆలయాలపైన జరుగుతున్న దాడులను తాము తీవ్రంగా ఆక్షేపిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వలంటీర్లతో చేయిస్తున్న సర్వేలో రూపొందించిన ఫార్మెట్‌లో వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఆదివాసి మతం చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. వెంటనే దీనిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ జి.సత్యనారాయణ, బీజేపీ నాయకుడు తోట నగేశ్‌ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచే యాలన్నారు. పార్టీ నాయకులు వై.మాలకొండయ్య, పి.రవిరాజు, డాక్టర్‌ ఎం.మల్లేశ్వరి, బీవీఎస్‌.వర్మ, ఎం.శ్రీనివాసగాంధీ, కువల కుమార్‌, సేనాపతి సూర్యారావు, ఇంజరపు సూరిబాబు, పెంకే శ్రీను, కర్రి శ్రీను, దేవాది మంగాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T05:54:34+05:30 IST