సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-12-02T05:23:01+05:30 IST

ప్రస్తుతం ఎక్కువగా ఆన్‌లైన్‌లో అనేకరకాలుగా మో సాలు పెరుగుతున్నాయని, వాటిపై అప్రమత్తంగా ఉండాలని పాలకొండ డీఎస్పీ ఎ.శ్రావణి అన్నారు. మంగళవారం సుబలయ గ్రామంలోని ఒక కల్యాణ మండపంలో డిగ్రీ విద్యార్థులు, స్థానికులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న పాలకొండ డీఎస్పీ శ్రావణి

 డీఎస్పీ శ్రావణి

హిరమండలం: ప్రస్తుతం ఎక్కువగా ఆన్‌లైన్‌లో అనేకరకాలుగా మో సాలు పెరుగుతున్నాయని, వాటిపై అప్రమత్తంగా ఉండాలని పాలకొండ డీఎస్పీ ఎ.శ్రావణి అన్నారు. మంగళవారం సుబలయ గ్రామంలోని ఒక కల్యాణ మండపంలో డిగ్రీ విద్యార్థులు, స్థానికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి యువత, పిల్ల లు ఎక్కువగా సెల్‌మోజులో పడి ఆన్‌లైన్‌ మోసాలకు గురౌతున్నారన్నా రు. ప్రజల అమాయకత్వాన్ని, అవగాహన లోపాన్ని అనుకూలంగా మలు చుకొని మోసగిస్తున్నారన్నారు. ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని కోరారు.  అలాగే రానున్న రెండు నెలలు పండగలు ఎక్కువగా ఉన్నందున ఇంటి చోరీలు, గొలుసు దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పాత పట్నం సీఐ రవిప్రసాద్‌, ఎస్‌ఐ మధుసూదనరావు పాల్గొన్నారు. 


 మహిళా పోలీసులతో పెనుమార్పు 

పాతపట్నం: మహిళా పోలీసులతో వ్యవస్థలో పెనుమార్పులు సాధ్య పడతాయని పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి అన్నారు.  ఓ కల్యాణ మండపంలో మంగళవారం సర్కిల్‌ పరిధిలోని గ్రామ మహిళా సంరక్షణ కార్యక ర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం,  నేరనియంత్రణలో ప్రధాన భూమిక పోషించాలన్నారు. కార్యక్రమంలో సీఐ రవిప్రసాద్‌,  ఎస్‌ఐ మహ్మద్‌ అమీర్‌, సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు.

 

 

Updated Date - 2020-12-02T05:23:01+05:30 IST