బ్యాంకుల విలీనంతో ప్రయోజనాలు

ABN , First Publish Date - 2020-11-26T05:09:34+05:30 IST

యూనియన్‌ బ్యాంకులో ఆంధ్రా, కార్పొరేషన్‌ బ్యాంకులను విలీనం చేయడం వల్ల ఖాతాదారులకు అనేక ప్రయోజనాలు చేకూరాయని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (విశాఖపట్నం) ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ బి.శ్రీనివాస్‌ శెట్టి తెలిపారు.

బ్యాంకుల విలీనంతో ప్రయోజనాలు

  

 తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాం

 యూనియన్‌ బ్యాంక్‌ ఎఫ్‌జీఎం శ్రీనివాస్‌శెట్టి 

గుజరాతీపేట:యూనియన్‌ బ్యాంకులో ఆంధ్రా, కార్పొరేషన్‌ బ్యాంకులను విలీనం చేయడం వల్ల ఖాతాదారులకు అనేక ప్రయోజనాలు చేకూరాయని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (విశాఖపట్నం) ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌  బి.శ్రీనివాస్‌ శెట్టి తెలిపారు.  ఆత్మనిర్బర్‌ ప్యాకేజీ,  జిల్లాలోని బ్యాంకు శాఖల పని తీరుపై స్థానిక లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రెండు బ్యాం కుల విలీనంతో యూబీఐ అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. సూక్ష్మ, మధ్య తరగతి రుణాలు (ఎంఎస్‌ఎంఈ)కు చేయూతనిచ్చేందుకు అవకాశం ఏర్పడింది.  తక్కువ వడ్డీకే ఎక్కువ మొత్తంలో రుణాలను ఖాతాదారులకు అందజేసే సౌలభ్యం లభించింది. జిల్లాలో సుమారు రూ.3,600 కోట్ల లావాదేవీలనిర్వాహణ ఎంతో గర్వకారణం. కొవిడ్‌ తర్వాత వాహనరంగంలో కొనుగోలు శక్తి చాలావరకు పెరిగింది. ఇది యూబీఐకి కలసి వచ్చింది.  బంగారంపై 60 పైసల వడ్డీకి రు ణాలందజేసేందుకు అవకాశం కలిగింది. ఆంధ్రా, కార్పొరేషన్‌ బ్యాంకుల సాఫ్ట్‌వేర్‌ విలీన ప్రక్రియ త్వరలో పూర్తవుతుంది.  బ్రాంచిలను మూసివేయడం కాకుండా భౌగోళికంగా పక్క పక్కన ఉన్న బ్రాంచీలను మాత్రమే విలీనం చేస్తాం. కొవిడ్‌తో నష్టపోయిన స్వయం సహాయక సంఘాలు, ఎంఎస్‌ఎంఈ, మధ్య తరగతి వ్యాపారుల కోసం వేర్వేరుగా యూనియన్‌ సువిధ, యూనియన్‌ ఎమర్జెన్సీ లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌, యూనియన్‌ కొవిడ్‌ పర్సనల్‌ లోన్‌ పథకాలను ప్రవేశపెట్టాం. పీఎం స్వానిధి పథకం కూడా అమలు చేస్తున్నాం.  క్షీణ స్థితిలో ఉన్న సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలను ఆదుకోవడానికి రీషెడ్యూలు/రీస్ట్రక్టరింగ్‌ చేసే అవకాశం కల్పిస్తున్నాం. దీని కోసం డిసెంబరు 31లోగా పరిశ్రమ యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో యూబీఐ లీడ్‌ బ్యాంకుగా ఉంది. దీనివల్ల జగనన్న తోడు, వైఎస్‌ఆర్‌ బీమా, పీఎం స్వానిఽధిలను అమలు చేయడంలో ప్రథమ స్థానంలో ఉన్నాం.’ అని శ్రీనివాస్‌ తెలిపారు. కార్యక్రమంలో రీజనల్‌ హెడ్‌ పి.కృష్ణమూర్తి, ఎల్‌డీఎం హరిప్రసాద్‌,  జిల్లాలోని వివిధ శాఖల చీప్‌ మేనేజర్లు దుర్గాప్రసాద్‌, శ్రీనివాస్‌ ఫనీ, మహేందర్‌, సింహాచలం, అంజనేయులు, మండల్‌ పాల్గొన్నారు. 

 


Updated Date - 2020-11-26T05:09:34+05:30 IST