ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి : డీఐజీ

ABN , First Publish Date - 2020-12-25T05:49:36+05:30 IST

ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి : డీఐజీ

గుజరాతీపేట : ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌, మొబైల్‌ యాప్‌లతో తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తామని నమ్మించి, మోసగించే ప్రమాదం ఉందని, అటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. కేవైసీ వివరాలను అపరిచిత వ్యక్తులకు ఇవ్వొదన్నారు.   ప్రేమ పేరుతో యువతీ యువకులు మోసపోవద్దని సూచించారు. పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సినబాధ్యత తలిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. 

Updated Date - 2020-12-25T05:49:36+05:30 IST