ముగ్గురికి బెయిల్ మంజూరు
ABN , First Publish Date - 2020-04-28T10:58:07+05:30 IST
కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై దురద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన

కోటబొమ్మాళి, ఏప్రిల్ 27: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై దురద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన కేసులో అరెస్ట్ చేసిన ముగ్గురికి సోమవారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మం జూరు చేసింది. ఈ కేసులో రాధావల్లభాపురానికి చెందిన బొడ్డేపల్లి వెంకటేశ్వరరావు, సనపల కృష్ణమూర్తితో పాటు వీరిని ప్రోత్సహించిన టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరిని టెక్కలి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన సంగ తి తెలిసిందే. సోమవారం వారికి కోర్టులో హాజరుపరచగా జూనియర్ సివిల్ జడ్జి ఎం.ప్రకాశ్‌బాబు విచారించి మే 8వ తేదీ వరకు ఈ ముగ్గురు హోం క్వారంటైన్‌లోనే ఉం డాలని, బయట తిరగకూడదని కండీషనల్ బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు.