ఈ నెల 23న సిక్కోలులో సంపూర్ణ బంద్‌

ABN , First Publish Date - 2020-08-18T18:33:13+05:30 IST

శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో కరోనా కేసులు పెరు గుతున్న నేపథ్యంలో..

ఈ నెల 23న సిక్కోలులో సంపూర్ణ బంద్‌

గుజరాతీపేట(శ్రీకాకుళం): శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో కరోనా కేసులు పెరు గుతున్న నేపథ్యంలో ఈ నెల 23వ తేది ఆదివారం సంపూర్ణ బంద్‌ చేపట్టనున్న కమిషనర్‌ పల్లి నల్లనయ్య సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజున అన్ని వ్యాపార సంస్థలతోపాటు చికిన్‌, ఫిష్‌, మటన్‌, కూరగాయలు, తోపుడు బండ్లు, టిఫిన్‌ సెంటర్లు, సెలూన్‌ షాపులతో సహా అన్ని మూసివేయాలన్నారు. రైతు బజార్లు, 80 అడుగుల రోడ్డులోని కూరగాయల మార్కెట్లు కూడా తెరవకూడ దన్నా రు. నిబంధనలు పాటించని వ్యాపారుల లైసెన్సులను రద్దు చేయడంతోపాటు జరి మానా విధిస్తామని హెచ్చరించారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా వీధుల్లో పందిర్లు వేయడానికి ఎటువంటి అనుమతి లేదన్నారు.


Updated Date - 2020-08-18T18:33:13+05:30 IST